telugu navyamedia
రాజకీయ వార్తలు

జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా పిటిషన్‌పై … 23న తీర్పు..

judgement on 23rd in justice misra petition

జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాను భూ సేకరణ చట్టంపై విచారణ జరుపుతున్న రాజ్యాంగ ధర్మాసనం నుండి తొలగించాలని దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 23న తీర్పు ప్రకటించనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. భూ సేకరణ చట్టంలో నష్ట పరిహారానికి సంబంధించిన నిబంధనల చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై ఐదుగురు సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్నది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, ఇందిరా బెనర్జీ, వినీత్‌ శర్మ, రవీంద్రభట్‌ ధర్మాసనంలో సబ్యులుగా ఉన్నారు. ఈ ధర్మాసనం నుండి జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాను తొలగించాలని కోరుతూ వివిధ రైతు సంఘాలు, ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ బుధవారంతో ముగిసింది.

గత ఏడాది వెలువరించిన తీర్పులో జస్టిస్‌ మిశ్రా భాగస్వామిగా ఉన్నందును విచారణ నుండి ఆయనే స్వచ్ఛందంగా తప్పుకోవాలని రైతు సంఘాలు, ప్రైవేటు వ్యక్తుల తరుపున కోర్టుకు హాజరైన సీనియర్‌ అడ్వకేట్‌ శ్యామ్‌ దివాన్‌తో పాటు ఇతర న్యాయవాదులు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. జస్టిస్‌ మిశ్రా భాగస్వామిగా ఇచ్చిన తీర్పులోని ఖచ్చితత్వాన్ని ఇప్పటి ధర్మాసనం పరిశీలిస్తున్నందున న్యాయపరమైన ఔచిత్యంతో మిశ్రా ను తొలగించాలని వారు కోరారు.

Related posts