telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

హాటెస్ట్ వెజిటేరియన్ గా శ్రద్దా కపూర్‌…

Shraddha

పీపుల్ ఫర్ ఎతికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పీఈటీఏ) ఈ ఏడాది తుది దశలో భాగంగా ఏడాదిలోని హాటెస్ట్ వెజిటేరియన్స్ పేర్లను తెలిపింది. అందులో బాలీవుడ్ నటులు సోనూసూద్, శ్రద్దాలు మొదటి స్థానాల్లో నిలిచారు. అయితే ఈ సందర్భంగా ఈ సంస్థ వారు హగ్ ఏ వెజిటేరియన్ డేను నిర్వహించారు. దీనికి సోనూ హాజరయ్యాడు. అంతేకాకుండా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ మెక్ డొనాల్డ్స్ తన మెన్యూలో మోక్‌వీగన్ బర్గర్ చేర్చాలన్న దానికి తన సపోర్ట్ తెలిపాడు. అంతేకాకుండా తాను తన కుమారిడితో క్రికెట్ ఆడుతున్న సమయంలో దెబ్బతిన్న పావురాన్ని కూడా అతడు కాపాడాడు. సోనూ సూద్ అభిమానులు అందరికీ అతడు శాకాహారన్నది తెలిసిన విషయమే. అంతేకాకుండా అతడిది దయా హృదయం కూడా. అయితే శ్రద్దాకు ఈ సంస్థవారు ఇచ్చిన పుస్తకం మాంసా ఆహారాన్ని విడిచిపెట్టాలనే కోరికను కలిగించింది. దాంతో శ్రద్దా మాంసా ఆహారం తీసుకోవడం కూడా మానేసింది. ఎక్కడికి వెళ్లినా జంతువుల పట్లు మాట్లాడటం అంటే శ్రద్దాకు ఎంతో ఇష్టం. దాంతో వీరిద్దరూ తమ అభిమానులు శాకాహారం తినే విధంగా ప్రోత్సహిస్తున్నారిన వీరిని పీఈటీఏ సంస్థ సత్కరించంది. ఈ అవార్డును ఇంతకు ముందు ఎందరో గెలుచుకున్నారు. వారిలో పీఎం నరేంద్ర మోదీ, అమితాబ్ బచ్చన్, మనుషి చిల్లర్, అనుష్క శర్మా, కార్తిక్ ఆర్యన్, విద్యత్ జమ్వాల్, కంగనా రనౌత్, షాహిద్ కపూర్, రేఖాలు తర్వాత నిలిచారు.

Related posts