telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

స్కూళ్ళు ప్రారంభించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తమిళనాడు…

private schools collecting interest on late fee

ఈ ఏడాది ఆరంభం నుంచి కరోనా తన పంజాను మన దేశం పైన విసిరింది. ఈ వైరస్ బారినపడి మరణించినవారి సంఖ్య ఇప్పటికే లక్ష దాటింది. అయితే మొదట లాక్ డౌన్ లో భాగంగా మూసేసిన స్కూల్ లను ఈ మధ్యే మళ్ళీ తెరుస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఏపీ కూడా ఈ నెల ఆరంభం నుండే స్కూల్ లను ప్రారంభించింది. అదే మార్గం లో తమిళనాడు కూడా పాఠశాలలను ప్రారంభించడానికి సిద్ధమైంది. కానీ ఇప్పుడు అక్కడి ప్రభుత్వం స్కూళ్ల పునప్రారంభంపై సర్కార్ వెనక్కి తగ్గింది.  స్కూళ్ళు ప్రారంభించే నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  మొదట ఈనెల 16 వ తేదీ నుంచి స్కూళ్ళు తెరవాలని సర్కార్ నిర్ణయించింది.  అయితే రానున్న రోజుల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యాధికారులు నివేదికలు ఇవ్వడంతో ప్రభత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలను స్కూళ్లకు పంపించేది లేదని తల్లిదండ్రులు సర్కార్ కు తేల్చి చెప్పారు.  దీంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.  తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు స్కూళ్ళు తెరవకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.  ఇక గతంలో ఆధ్యాత్మిక, రాజకీయ,సినిమా సమావేశాలకు ఇచ్చిన అనుమతులను కూడా తమిళనాడు సర్కార్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts