telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది : నిర్మలా సీతారామన్

Nirmalasitaraman

కరోనా సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని…అలాగే పలు రంగాలు కూడా ఆర్థికంగా పుంజుకున్నాయని తెలిపారు. అక్టోబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.05 లక్షల కోట్లు దాటయన్నారు. గతేడాది అక్టోబరుతో పోలిస్తే..ఇది 10 శాతం అధికమని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. బ్యాంకు రుణాలు 5.1 శాతం పెరిగాయన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 13 శాతం పెరిగాయని…ఏప్రిల్‌-ఆగస్టు 35.37 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో వృద్ధిరేటు పెరుగుతుందని ఆమె అంచనా వేశారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర అభియాన్‌ మంచి ఫలితాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. “ఒకే దేశం.. ఒకే రేషన్‌” పథకంతో 68.6 కోట్ల మంది లబ్ధిదారులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్‌ తీసుకోగలుగుతున్నారని చెప్పారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా 2.5 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించామని పేర్కొన్నారు.

Related posts