telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కరోనా బారిన పడిన హీరో సూర్య…

Surya

మన దేశంలో కరోనాకు మందు పంపిణి జరుగుతున్న ఈ వైరస్ కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే వారు వీరు అనే తేడా లేకుండా అందరూ ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు, రాజకీయనాయకులు దీని బారిన పడ్డారు. ఇక తాజాగా తమిళ స్టార్ హీరో సూర్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాను. మన జీవితం ఇంకా సాధారణ పరిస్థితికి రాలేదన్న విషయాన్ని మనందరం గ్రహించాలి. అలాగని భయంతో వణికిపోకూడదు. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నాకు వైద్యం అందిస్తోన్న వైద్యులకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సూర్యకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. హీరో సూర్య కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో చేస్తున్నారు.  ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఏం చేస్తుంది అనేది.

Related posts