telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ : రాష్టాలకు ఉచితంగానే వ్యాక్సిన్ సరఫరా

modi delhi

కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో మోడి సర్కార్ ఓ శుభ వార్త చెప్పింది. కరోనా వ్యాక్సిన్ ధరలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ టీకాలను రూ. 150 లకే కొంటామని పేర్కొంది కేంద్రం. వ్యాక్సిన్ ధరలపై నెలకొన్న గందరగోళంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. తాము కొనుగోలు చేసిన వాటాను రాష్ట్రాలకు ఉచితంగానే సరఫరా చేస్తామని వెల్లడిచింది. వ్యాక్సిన్ ఉత్పత్తి దారులు 50శాతం టీకాలను కేంద్రానికి, 50 శాతం టీకాలను రాష్ట్రాలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు అందించనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి.  రాష్ట్రాలకు ఒక్కో డోసును రూ.400 లకు అందించాలని నిర్ణయం తీసుకున్నాయి.  దీనిపై సర్వత్రా వ్యతిరేకత ఎదురైంది.  కేంద్రానికి ఒక ఒక ధర, రాష్ట్రాలకు ఒక ధర అని నేతలు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.  ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు ఉచితంగా టీకాలను అందించాలని నిర్ణయం తీసుకుంది.

Related posts