telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ : హౌజ్ మేట్స్ పై ఫైర్… మధ్యలోనే షో విడిచి వెళ్ళిపోయిన హీరో

Salman-Khan

బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషలలో విజయవంతంగా కొనసాగుతోంది. తెలుగులో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో పూర్తి కావడానికి మరికొన్ని రోజులే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు ? ఎవరు విన్నర్ అవుతారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇక తమిళంలో కూడా ఈ షో వివాదాల మధ్య విజయవంతంగా నడుస్తోంది. హిందీలో ఈ షోకు విపరీతమైన పాపులారిటీ రావడంతో తమిళం, తెలుగులోనూ మొదలైంది. తెలుగు బిగ్ బాస్‌కు మూడో సీజన్ రన్ అవుతుండగా, అటు హిందీలో మాత్రం ఇప్పటికే 12 సీజన్లు గడిచాయి. అంతేకాదు, తాజాగా 13వ సీజన్ కూడా ప్రారంభమైంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉన్న ఈ బిగ్ బాస్‌ రియాలిటీ షోలో బాలివుడ్ సెలబ్రిటీలతో పాటు పాప్ సింగర్స్, బుల్లితెర భామలు కూడా పాల్గొంటున్నారు. కాగా… హోస్ట్ సల్మాన్‌ఖాన్‌కు ఇంటి సభ్యులపై కోపం వచ్చింది. అంతే తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. దీనికి సంబందించిన ఓ ప్రోమోను కలర్స్‌ టీవీ విడుదల చేసింది. ఆ ప్రోమోలో సల్మాన్ ఈ సందర్భంగా ఇంటి సభ్యులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘”ఏమైనా తమాషాగా ఉందా?” అంటూ పెద్దగా అరుస్తూ.. తాను బిగ్‌బాస్‌ నుంచి వెళ్లిపోతున్నట్లు చెప్పారు. దీంతో షాక్ తిన్న ఇంటి సభ్యులు, అలా చూస్తూ ఉండిపోయారు. తాజాగా విడుదల చేసిన ఈ ప్రొమోలో ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ అభిమానులు. అయితే ఇదంతా టీఆర్పీ రేటింగ్‌ కోసం చేసిన ఎత్తుగడ అని అంటున్నారు నెటిజన్స్. ఇలా సల్మాన్‌ ఖాన్ బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి వెళ్లిపోతాననడం కొత్త విషయమే కాదని, ఇంతకు ముందు సీజన్‌లలో కూడా ఇలాంటి స్టంట్స్ చేశారని అంటున్నారు. ఏదేమైనా అసలేం జరిగిందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ ను చూడాల్సిందే.

Related posts