telugu navyamedia
వార్తలు సామాజిక

డాక్టర్లు అధిక సమయం పనిచేయడం ప్రమాదకరం: ఇండియన్‌ చెస్ట్‌ సొసైటీ

karona chekup hospital

కరోనా ఐసోలేషన్‌ వార్డుల్లో వైద్య సిబ్బంది ప్రతిరోజు ఏకధాటిగా 10 గంటల కన్నా అధిక సమయం పనిచేయడం ప్రమాదకరమని ఇండియన్‌ చెస్ట్‌ సొసైటీ ప్రకటించింది. ఈ నెల చివరి నాటికి దేశంలో కరోనా తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ‘మనకి మరో నెల సమయం ఉందని తెలిపింది.

ఏప్రిల్‌ చివరి నాటికి లేక మే తొలి వారం నాటికి దేశంలో కరోనా కేసులు తీవ్రతరమయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే, పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేస్తే ఈ తీవ్రతను తగ్గించుకోవచ్చు’ అని ఇండియన్‌ చెస్ట్‌ సొసైటీ చీఫ్ క్రిస్టోఫర్ తెలిపారు. లాక్‌డౌన్‌ చర్యలతో తప్పకుండా కరోనా వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉందని వివరించారు.

Related posts