telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ముల్లంగితో.. కిడ్ని రాళ్లకు చెక్ !

ముల్లంగిలో చాలా అద్భుతమైన ఔషద గుణాలు ఉన్నాయి . ఇది అంత రుచిగా ఉండదని చాలమంది తినరు. దీనిలో దుంప కన్నా ఆకుల్లో కాల్షియం , ఫాస్పరస్ , ఐరన్ , C విటమిన్ లు ఎక్కువగా ఉన్నాయి . దుంపలతో పాటు ఆకులను కూడా వండుకుని తింటే చాలా మంచిది.

* ముల్లంగిని జ్యూస్ గా తీసుకుని తాగుతూ ఉంటే లివర్ లో కలిగే వ్యాధుల్ని నివారిస్తుంది.

* ముల్లంగి ఆకులని , దుంప ని ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని ఒక చెంచా చొప్పున తేనెలో కలిపి తీసుకుంటూ ఉంటే ఏ అవయవంలో వాపు ఉన్నా నివారణ అవుతుంది.

* పచ్చి ముల్లంగి దుంపలు , ఆకుల రసాన్ని తీసి తాగుతూ ఉంటే సాఫీగా విరేచనం అవుతుంది. జీర్ణశక్తి పెరుగుతూ అకలిని కూడా వృద్ది చేస్తుంది . లివర్ వ్యాధులని తగ్గిస్తుంది .

* ముల్లంగి విత్తనాల్ని ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని రోజు కొంచం అన్నంలో కలుపుకుని తింటూ ఉంటే స్త్రీలలో ఋతుస్రావ దోషాలు నివారించబడును.

* ఆగకుండా ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు కొంచం ముల్లంగి రసాన్ని త్రాగితే వెంటనే తగ్గిపోతాయి .

* విపరీతం అయిన జలుబు , దగ్గు , ఆయాసంతో బాధపడేవారు ముల్లంగి రసాన్ని తాగితే త్వరగా దోషాలు అన్ని నివారించబడును.

* మూత్రపిండాలు లొ ఏర్పడిన రాళ్లు కరిగించడానికి ముల్లంగి ఎంతో మంచిది. ముల్లంగిని ఆకులతో సహా వండుకుని తింటే ఈ సమస్య నివారణ అగును.

* ముల్లంగి రసం తీసి దానిలో నాలుగోవంతు నూనె వేసి నూనె మాత్రమే మిగిలేలా కాచి ఆ నూనెని భద్రపరచుకొని ఆ నూనెని వడకట్టాలి. చెవిపోటు , చెవిలొ హోరు మొదలయిన బాధలు ఉన్నవారు చెవిలో ఒక 4 చుక్కలు వేసుకొంటే వెంటనే ఉపశమనం కలుగును.

Related posts