telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ పోలీసులకు .. గ్రూప్ ఇన్సూరెన్సు పెంపు…

group insurance increased to AP police

సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాదాల సమయంలో పోలీసులకు అందించే గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీని పెంచారు. ఈ మేరకు సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర పోలీసు అధికారులు రూ.4.74కోట్ల చెక్కును న్యూ ఇండియా ఇన్సురెన్స్ కంపెనీకి అందజేశారు. ఈ ఇన్సూరెన్స్, ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులకు ఉపయోగపడనుంది. దీని ద్వారా డీఎస్పీ, ఆ పై అధికారులకు రూ.45లక్షలు.. ఎస్‌ఐ, సీఐలకు రూ.35లక్షలు.. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లకు రూ.13లక్షల ఇన్సూరెన్స్ వర్తించనుంది. అలాగే పోలీసులు సహజమరణం చెందితే, వారి కుటుంబానికి రూ.30లక్షలు, ఒకవేళ టెర్రరిస్టుల దాడిలో మరణిస్తే రూ.40లక్షల పరిహారం లభిస్తుంది.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సుమారు 20ఏళ్ల తరువాత పోలీసులకు గ్రూప్ ఇన్సూరెన్స్ మొత్తం పెరుగుతోందని.. దీనివలన రాష్ట్రంలోని 64,719 పోలీసు కుటుంబాలు లబ్ధి పొందుతాయని తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా జగన్ పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖకు ఇచ్చిన హామీలను ఆయన నెరవేరుస్తూ వస్తున్నారు. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన కొత్తలోనే పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించారు జగన్, ఇప్పుడు వారికి ఇన్సూరెన్స్‌ పెంచారు. దీనిపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts