telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అమరావతిలో బహిరంగ సభ… బాబు కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు

chandrababu tdp ap

ఏపీ లో మూడు రాజధానుల అంశం తెరమీదకు రావడంతో ఆరోజున తుళ్లూరు, వెలగపూడి, మందడం, రాయపూడి తదితర గ్రామాల్లో రైతులు రోడ్డు మీదకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అమరావతి ఉద్యమం మొదలయ్యి నేటికీ సంవత్సరం కావడంతో రాయపూడిలో రైతుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.  ఈ సభకు భారీ సంఖ్యలో రైతులు, రైతు సంఘాలు, పలు రాజకీయపార్టీలు మద్దతు ఇచ్చాయి.  అయితే, ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యేందుకు వెళ్తుండగా, వెలగపూడి వద్ద బాబు కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు.  ఉద్దండరాయునిపాలెం నుంచి ఉద్యమం జరుగుతున్న గ్రామాల మీదుగా రాయపూడికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.  బాబు కాన్వాయ్ ని అడ్డుకోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  బహిరంగ సభకు అనుమతి ఉన్నా, పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అయితే, పోలీసులు అనుమతించిన రూట్ లో కాకుండా మరొక దారిలో బాబు వెళ్తున్నారని, వేరే దారిలో వెళ్తే భద్రతాపరమైన సమస్యలు వస్తాయని, అందుకే కాన్వాయ్ ని అడ్డుకున్నామని పోలీసులు చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts