telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆఫ్ఘనిస్థాన్ నిర్ణయాన్ని స్వాగతించిన మోదీ

narendra-modi

కరోనా వైరస్ ధాటికి ఆసియా దేశాలు అతలాకుతమవుతున్నాయి. ఆసియా దేశాలు కరోనాపై ఉమ్మడిగా పోరాడాలన్న ప్రధాని మోదీ పిలుపునకు పలు దేశాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో కొవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్ కు ఆఫ్ఘనిస్థాన్ ఒక మిలియన్ డాలర్ల ఆర్థికసాయం ప్రకటించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 

థాంక్యూ ఆఫ్ఘనిస్థాన్’ అంటూ స్పందించారు. “దక్షిణాసియా దేశాలకు సంఘీభావం ప్రకటిస్తూ భారీ విరాళం ప్రకటించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను” అంటూ ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. అటు, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు గోతబయ రాజపక్సలకు కూడా మోదీ ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్ కొవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్ కు 1.5 మిలియన్ డాలర్లు ప్రకటించింది.

Related posts