telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతుల నిరసనలు ఫలించనున్నాయా…?

కేంద్రం కొత్తగా తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత 21 రోజులుగా ఢిల్లీలో నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలను విరమించాలని ప్రభుత్వం రైతులను పదేపదే కోరుతున్నా రైతులు వినడం లేదు. తప్పనిసరిగా చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ డిమాండ్ చేస్తున్నారు సవరణలు చేసేందుకు కూడా రైతులు ఒప్పుకోవడం లేదు. అయితే దేశ వ్యాప్తంగా రైతుల నిరసనలకు మద్దతు లభిస్తుంది. ఢిల్లీ సీఎం కూడా రైతులకు మద్దతుగా ఒకరోజు నిరాహార దీక్ష చేసారు. అయితే, ఇప్పుడు ఈ చట్టాలపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.  పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాలను సాగు చట్టాల నుంచి మినహాయింపులు ఇచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.  మద్దతు ధర ఇస్తూనే ఈ మూడు రాష్ట్రాలకు మినహాయింపులు ఇవ్వాలని కేంద్రం కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.  ఒకవేళ మూడు రాష్ట్రాలకు సాగు చట్టాల నుంచి మినహాయింపులు ఇస్తే మిగతా రాష్ట్రాల రైతులు కూడా ఇలానే ఉద్యమించకుండా ఉంటారా అనేది చూడాలి మరి.

Related posts