telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వారి పై కేసు పెట్టనున్న బిగ్ బాస్ మోనాల్…

Monal

బిగ్ బాస్ నాలుగో సీజన్ ఈ వారంతో ముగియనుంది. అయితే ఈ సీజన్లో పార్టిసిపెంట్స్ సోషల్ మీడియాలో తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ బిగ్ బాస్ షో పార్టిసిపెంట్స్ ఫ్యాన్స్, ఫ్రెండ్స్ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయడం కూడా ఈ రెండు సీజన్స్ లో ఎక్కువైంది. ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన మోనాల్ సైతం ఇలాంటి ట్రోలింగ్ కు గురైంది. తన కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తన సోదరిని ట్రోల్ చేసిన అభిజిత్ ఫ్రెండ్స్ పై సైబర్ క్రైమ్ కు రిపోర్ట్ ఇస్తున్నట్టు మోనాల్ తెలిపింది. తాను ఎవరితోనైనా సాఫ్ట్ గా మాట్లాడతానని, కానీ తన సిస్టర్… ఏదైనా డైరెక్ట్ గా, స్ట్రయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుందని, అదే అభిజిత్ స్నేహితులకు కోపం తెప్పించిందని, దాంతో వారు చాలా బ్యాడ్ గా తన ఫ్యామిలీని, సిస్టర్ ను ట్రోల్ చేశారని మోనాల్ వాపోయింది. తాను ఔట్ సైడర్ కావడం, తెలుగు బాగా మాట్లాడలేకపోవడంతో సోషల్ మీడియాలోని చాలామందికి తాను ఈజీ టార్గెట్ అయ్యానని మోనాల్ తెలిపింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తన కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు వారు ఈ ట్రోలింగ్ కారణంగా ఎంత మనో వేదనకు గురయ్యారో తెలిసిందని అంటోంది మోనాల్. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts