telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సైనా – కశ్యప్ ల మధ్య ఎప్పుడూ గొడవలేనట…!

అల్లు అరవింద్ కు చెందిన ఆహా యాప్ కోసం అక్కినేని కోడలు సమంత ఒక ప్రతిష్ఠాత్మక షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన రెండు ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ రెండు ఎపిసోడ్స్ సూపర్ హిట్ కూడా అయ్యాయి. మొదటి ఎపిసోడ్ సమంత విజయ్ దేవరకొండ తో చేయగా రెండో ఎపిసోడ్ రానా అలాగే మహానటి నాగ్ అశ్విన్ లతో చేసింది. ఈ మొదటి ఎపిసోడ్ కంటే రెండో ఎపిసోడ్ కి మంచి పేరు వచ్చింది. తాజాగా ఈ షో కి సంబంధించిన మూడవ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ మూడవ ఎపిసోడ్ లో సమంత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్ అలాగే పారుపల్లి కశ్యప్ లను ఇంటర్వ్యూ చేసింది. ఈ ప్రోమో ఆసక్తికరంగా సాగింది. సైనా – కశ్యప్ లది ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఉన్న అనేక రహస్యాలు బయట పెట్టేందుకు సమంత ప్రయత్నాలు చేసింది. అందులో రెండు వారాలకు ఒకసారి ఇద్దరం గొడవ పడుతుంటాం అని ఆమె చెప్పుకోచింది. ఇక ఫన్నీ ఫన్నీ గా సాగిన ఈ ప్రోమోని మీరు కూడా చూసేయండి మరి.

Related posts