telugu navyamedia
క్రీడలు వార్తలు

చెన్నై పిచ్ పై స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు…

భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ సందర్భంగా చెన్నై‌ పిచ్‌పై పెనుదుమారం రేగిన విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్ సందర్బంగా కూడా మళ్లీ అవే విమర్శలు వినిపిస్తున్నాయి. వికెట్ టర్నింగ్‌కు అనుకూలిస్తుండటంతో బ్యాట్స్‌మన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు డ్యూ ప్రభావం కూడా ఉంటుండతో బ్యాట్స్‌మెన్‌కు రన్స్ సాధించడం కష్టంగా మారుతోంది. ఈ క్రమంలోనే చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‌లన్నీ లో స్కోరింగ్ గేమ్స్‌గా ముగుస్తున్నాయి. అయితే ఐపీఎల్ జరిగే కొద్దీ పిచ్‌లు మరింత దారుణంగా తయ్యారయ్యాయనిరాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ట్వీట్ చేశాడు. ‘ఐపీఎల్ జరిగే కొద్ది పిచ్​లు మరింత దారుణంగా తయారయ్యాయి అనుకుంటున్నా. ఇలాంటి లీగ్​లో 160/170 అనేది మినిమన్ స్కోర్. కానీ 130/140 పరుగులు అంటే పిచ్ బాగోలేదని అర్థం” అంటూ ట్వీట్ చేశాడు. ఇక గాయంతో స్టోక్స్ ఈ లీగ్ నుంచి అర్దాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే.

Related posts