telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సిరిసిల్లలో రోడ్లపై జనాలు..జిల్లా కలెక్టర్ ఆగ్రహం

siricilla collector lockdown

కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలను సాధ్యమైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం సూచించింది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిస్థితిని చూసిన కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆగ్రహానికి గురయ్యారు.అవసరం లేకున్నా కొందరు రోడ్లపై తిరుగుతూ కనిపించడాన్ని గుర్తించిన కలెక్టర్ వారిపై మండిపడ్డారు.

స్వయంగా సిరిసిల్ల పట్టణంలో కలియదిరుగుతూ పర్యవేక్షణ చేసిన కలెక్టర్ అనేకమంది వాహనదారులకు క్లాస్ తీసుకున్నారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని, లేకపోతే కఠినచర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వాహనాలను ఆపి మరీ హెచ్చరించారు.ఓ బైక్ పై ముగ్గురు రావడాన్ని గుర్తించిన కలెక్టర్ వారిని ఆపి మందలించారు. కలెక్టర్ ఆగ్రహాన్ని దూరం నుంచే గమనించిన కొందరు వాహనదారులు అక్కడినుంచి వెనుదిరిగారు.

Related posts