పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఉత్తర భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో కశ్మీరీల పై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా లక్నోలో ఇద్దరు కశ్మీర్ వ్యాపారులపై స్థానిక అతివాదులు దాడికి పాల్పడ్డారు. రోడ్డు పై డ్రై ఫ్రూట్స్ అమ్ముకునే ఆ వ్యాపారులను చితకబాదారు. బుధవారం సాయంత్రం దలీగంజ్‌లో ఈ ఘటన జరిగింది.
కాషాయం దుస్తుల్లో వచ్చిన కొందరు ఆ వ్యాపారులపై విరుచుకుపడ్డారు. అయితే అక్కడున్న కొందరు అడ్డుకోవడంతో వివాదం సద్దుమణిగింది. గత కొన్నేళ్లుగా లక్నోలో కశ్మీరీలు డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు. విశ్వ హిందూ దళ్ వ్యక్తులు దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్కు పడుతుంది : నారాయణ