telugu navyamedia
క్రీడలు వార్తలు

బాధను మరచి భారత్ కో వచ్చిన పాండ్యా…

comments on hardhik pandya jersey

హర్ధిక్ పాండ్య టీమిండియా లో ఎంత స్ట్రాంగ్ ఆటగాడో అందరికీ తెలిసిందే.ముఖ్యంగా టీ20, వన్డేలలో అతడు చూపే ఉత్తమ ప్రదర్శన గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయాగల సత్తా ఉన్న ఆటగాడు. ఎన్నో సార్లు తన అగ్రెసివ్ పెర్ఫామెన్స్ తో జట్టులో కీలక పాత్ర వహించాడు ఈ హార్డ్ హిట్టర్. ఎటువంటి బంతినైనా బౌండరీ దాటించడంలో పాండ్య శైలి ప్రత్యేకం. గత ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన టీ20 సిరీస్ లో కీలక పాత్ర పోషించి జట్టుకు సిరీస్ ను అంధించాడు. ఆ తరువాత స్వదేశానికి చేరుకున్న పాండ్య మళ్ళీ ఇప్పుడు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. బ్యాట్‌తో పాటు బంతితో ప్రాక్టీసు చేస్తూ నెట్స్‌లో చెమట చిందిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పాండ్యా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘‘తిరిగి టీమిండియాతో చేరాను. సొంతగడ్డపై మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాను.. రెడ్‌బాల్‌ క్రికెట్‌లో తిరిగి ప్రవేశించాను’’ అంటూ ఉద్వేగపూరిత కామెంట్‌ జతచేశాడు. ఓ వైపు బ్యాటింగ్‌ చేస్తూనే, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ సహా పేసర్‌ బుమ్రాతో బౌలింగ్‌ గురించి చర్చిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటోలు పాండ్యా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

కాగా జనవరి 16న హార్దిక్‌ తండ్రి హిమాన్షు పాండ్యా గుండెపోటుకు గురై మరణించిన విషయం విదితమే. అయితే తండ్రి మరణంతో ఎంతో ఎమోషనల్ అయిన పాండ్య తరచూ తన మనసులోని భావోద్యెగాన్ని సోషల్ మీడియా ద్వారా అబిమానులతో పంచుకుంటూ ఉన్నాడు. తాను ఇంత స్థాయికి ఎదగడంలో తమ నాన్న గారి పాత్ర చాలా ఉంది అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యాడు పాండ్య. ఈ నేపథ్యంలో బాధను దిగమింగుకుని ఆటపై దృష్టి పెట్టిన పాండ్యాను అభిమానులు ప్రశంసిస్తున్నారు. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగనున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో పాండ్యా చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

Related posts