telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆమంచి కుటుంబంపై .. గార్డ్ పిర్యాదు.. తనకు ప్రాణహాని అంటూ..

home guard complaint on aamanchi brother

ఏపీలో అధికార వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడి కుమారుడు ఆమంచి రాజేంద్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. జిల్లాలోని ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న రవికుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసిన రాజేంద్ర.. తిట్లదండకం అందుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఆడియోను తెలుగుదేశం పార్టీ ఈరోజు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ జర్నలిస్టును తిడుతున్నట్లు చెబుతున్న ఓ ఆడియోను టీడీపీ నేత నారా లోకేశ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్న రవికుమార్ పోలీసులను ఆశ్రయించారు. చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ అన్న కొడుకు ఆమంచి రాజేంద్ర తన కాళ్లు, చేతులు నరికేస్తానని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ఆమంచి రాజేంద్ర, ఆయన కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణ హాని ఉందనీ, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఈ మేరకు ఈపురుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర తనతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో రికార్డులను పోలీసులకు అందజేశారు. తనకు ఆమంచి రాజేంద్ర 7799227777 నంబర్ నుంచి కాల్ చేశారని తెలిపారు. బయటకు చెప్పలేనిరీతిలో అసభ్యంగా ఆమంచి రాజేంద్ర మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts