పాపికొండల టూర్‌కు బయలుదేరిన ఓ టూరిజం బోట్ తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అటు, ఘటనపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్ వెంటనే సంఘటన స్థలానికి పయనమయ్యారు. సహాయ చర్యల కోసం రాజమండ్రి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ను ఘటనా స్థలానికి పంపారు. ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 24 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఇంకా 25 మంది ఆచూకి తెలియాల్సి ఉంది.