telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేపే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్… విజయం ఎవరిదో..?

municipal election counting started

ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ రేపు జరగనున్నది. నల్లగొండ పట్టణం లో ఆర్జాలబావి పరిధిలోని స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ గోదాముల్లో రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కు 48 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం ఎనిమిది రూమ్స్‌ను కౌంటింగ్‌ కోసం సిద్ధం చేశారు. 8 గదుల్లో గదికి ఏడు టేబుళ్ల చొప్పున 56 కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటు చేశారు.  మొత్తం 56 టేబుళ్లపై ఒక్కో రౌండ్‌లో 56వేల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. 600 మంది కౌంటింగ్ సిబ్బందిని ఎంపిక చేసి రెండు షిఫ్టులుగా విధులు కేటాయించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 450 మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేసారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో  మొత్తం 5 లక్షల 5 వేల 565 ఓట్లు కాగా 3 లక్షల 86 వేల 320 ఓట్లు పోలయ్యాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 76.41 శాతం  పోలింగ్ నమోదు కాగా… గత ఎన్నికల్లో  54.62 శాతం పోలింగ్  నమోదు కాగా ఈసారి 76.41 శాతం నమోదయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 71 మంది అబ్యర్థులు ఉన్నారు. అయితే అందులో ఎవరిని విజయం వరిస్తుంది అనేది చూడాలంటే వీచు ఉండాల్సిందే.

Related posts