telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆ చరిత్ర చంద్రబాబుదే..కొడాలి నాని భాషలో తప్పేముంది?

నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని ఏపీ మంత్రి ఆర్ కే రోజా విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం.. పది నిమిషాల వాయిదా సమయంలో ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయమై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని మంత్రి రోజా చెప్పారు. బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ నేతలు ప్రచారం చేసుకున్నారని ఆమె చెప్పారు.

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని రోజా విమర్శించారు. అమరావతి కావాలా? మూడు ప్రాంతాలు కావాలా అని ప్రజలను టీడీపీ నేతలు అడగాలన్నారు.

గతంలో నారా లోకేశ్ తీరుపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు పదో తరగతి ఫలితాలపై జూమ్ మీటింగ్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ వస్తే లోకేశ్ ఎందుకు పారిపోయాడో చెప్పాలని ప్రశ్నించారు.

ఇక జీవితంలో లోకేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టలేరని వెల్లడించారు. అంతే కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తలకిందులుగా తపస్సు చేసినా ఇప్పుడున్న 23 సీట్లు కూడా గెలవలేరని విమర్శించారు

కొడాలి నాని భాషలో తప్పేముందని ప్రశ్నించారు. కొడాలి నానిపై ఈగ వాలినా సహించబోమని అన్నారు. టీడీపీ వాళ్లంతా కలిసినా కొడాలి నాని గెడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Related posts