telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు జిహెచ్ఎంసి నగర వ్యాప్తంగా వార్డు వ్యవస్థ అమలు – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

వార్డు ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

 ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు జిహెచ్ఎంసి నగర వ్యాప్తంగా వార్డు వ్యవస్థను అమల్లోకి తెచ్చిందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. గురువారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్ లతో కలిసి వార్డు అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి విజన్ ను అనుసరించి 50 వేల జనాభాకు ఒక వార్డును ఏర్పాటు చేస్తూన్నట్లు అన్నారు వార్డు కార్యాలయాలను పది మంది  వివిధ  విభాగాలకు చెందిన అధికారుల బృందం తో  వార్డు పరిపాలన వ్యవస్థను త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రజల నుండి అందిన ఫిర్యాదులను  సంబంధిత అధికారులు సత్వరమే  చర్యలు తీసుకుని తిరిగి ఫిర్యాదు దారుడికి సమాచారాన్ని అందించడం లక్ష్యంగా వార్డు వ్యవస్థ పని చేస్తుందని తెలిపారు. వార్డు స్థాయి లో వచ్చే తాగునీటి సమస్యలు, సీవరేజ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ తదితర సమస్యలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సిటీజన్ చార్ట్ ఆధారంగా నిర్ణీత సమయంలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.  అధికారులు పౌరుల సమస్యలను సావధానంగా విని దరఖాస్తులు సేకరించి అట్టి సమస్యల పరిష్కారానికి యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు ప్రజల తో సానుకూల దృక్పథంతో, సహనంతో పారదర్శకతతో, జవాబుదారీతనంతో ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని తెలిపారు. వార్డు లెవెల్ అధికారులు కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ వార్డు పరిపాలన  సంబంధించిన నియమావళి పుస్తకాన్ని ఆవిష్కరించారు.

జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ మాట్లాడుతూ… వార్డు వ్యవస్థను నెలకొల్పడం ద్వారా నగర నలుమూలల నుండి వస్తున్న ప్రజా సమస్యలను అత్యంత సులువుగా, వేగవంతంగా పరిష్కరించడానికి వీలు పడుతుందన్నారు. వార్డు ఆఫీస్ లలో జిహెచ్ఎంసి విభాగాలైన బయోడైవర్సిటీ, హెల్త్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, వార్డ్ ఇంజనీర్, ఎంటమాలజీ, వాటర్ వర్క్స్, విద్యుత్, కమ్యూనిటీ , పని చేస్తాయని తెలిపారు.  ప్రజలు తమ సమస్యలను విన్నవుంచెందుకు హెడ్ ఆఫీస్, సర్కిల్ జోనల్ కార్యాలయాల వెళ్లకుండా తమ సమస్యలను  దగ్గలో నున్న వార్డు కార్యాలయానికి వచ్చి విన్న  వించెందుకు వస్తారని అప్పుడు అధికారులు వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు  ముందు ప్రజలు వార్డు ఆఫీస్ కు వచ్చే  ప్రజలకు మరుడపూర్వకంగ వ్యవహరించాలని అన్నారు. ఎక్కువగా శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల పై నే పిరుదులు వస్తున్నాయన్నారు వార్డు లెవెల్ సిబ్బంది ముందుగా  ఉదయం పూట తమ పరిధిలో వార్డు లో పర్యటించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి  చేయాలి మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు తప్పని సరిగా అందరూ వార్డు కార్యాలయం లో ఉండాలన్నారు ఉదయం తీసుకున్న  విన్నపాలు, ఫిర్యాదులను డేటా ఎంట్రీ చేసి సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేసి, సమస్య పరిష్కారం అయిన తర్వాత ఫిర్యాదు దారుడికి విషయాన్ని తెలియజేయాలి అని తెలిపారు. వార్డు స్థాయి లో సిటీజన్ చార్ట్ ప్రకారం సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. వార్డు వ్యవస్థ పౌర సేవల కేంద్రంగా పని చేయాలని తెలిపారు. వార్డు వ్యవస్థ పై టౌన్ ప్లానింగ్, ఎంటమాలజీ, శానిటేషన్, వాటర్ వర్క్స్ వంటి పలు విభాగాల పై సమగ్ర శిక్షణ ను నగర వ్యాప్తంగా సంబంధిత జోన్ లలో హెచ్.ఓ.డి లతో నిర్వహిస్తున్నామని తెలిపారు. శనివారం నాడు డిప్యూటీ కమిషనర్లకు, వార్డు లెవల్ అధికారులకు సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. వార్డు కార్యాలయంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు, పరిపాలన పై ఎప్పటికప్పుడు జోనల్, డిప్యూటీ కమిషనర్లు రోజువారీగా సమీక్షించాలని తెలిపారు. వార్డు వ్యవస్థ పనితీరుపై నెల రోజుల్లో పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. వార్డు లెవెల్ అధికారులు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

జలమండలి ఎండీ దానకిషోర్ మాట్లాడుతూ… పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా సమస్యలను విస్తృతంగా పరిష్కరించడానికి వార్డు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ప్రతిరోజు సోషల్ మీడియా, వాట్సప్, హెల్ప్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా అందుతున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలోనే ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వాటర్ వర్క్స్ నగరానికి వందేళ్లకు సరిపడా తాగునీటి వసతి, వంద శాతం సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను ఏర్పాటు తెలిపారు.  వార్డు అధికారులు ప్రజలతో సామరస్యంగా ఉండి పని చేయాలని తెలిపారు.

వాటర్ వర్క్స్ లో 48 రకాల గ్రీవెన్స్ పై హెల్ప్ లైన్ ద్వారా 30 మంది పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఇందులో సిల్ట్ కార్ట్, లో వాటర్, పొల్యూట్ వాటర్ పై లైన్ మెన్ టెస్టింగ్ లను నిర్వహిస్తారని అన్నారు. త్రాగునీరు లీకేజీ కాకుండా టెక్నాలజీ ద్వారా గుర్తించి, రివర్స్ వాటర్ సప్లై కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రియాంక అలా, ఇ.ఎన్.సి జియా ఉద్దీన్, ఇ.వి.డి.ఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, సిసిపి దేవేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ లు వి.కృష్ణ, జయరాజ్ కెన్నెడీ సరోజ, జోనల్ కమిషనర్లు మమత, రవి కిరణ్, పంకజ, శంకరయ్య, శ్రీనివాస్  రెడ్డి, అశోక్ సామ్రాట్, ఆస్కీ ప్రొఫెసర్ స్నేహలత, ప్రాజెక్ట్   ఆఫీసర్ సౌజన్య, డిప్యూటీ కమిషనర్లు, వార్డు పరిపాలన అధికారులు, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts