telugu navyamedia
రాజకీయ వార్తలు

సీఏఏను వ్యతిరేకిస్తున్న మమత..నేడు అసెంబ్లీలో తీర్మానం!

mamatha benerji

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) సీఏఏకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతోపాటు బీజేపీయేతర రాష్ట్రాలన్నీ తీర్మానం చేయాలని ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన పంతం నెగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. తొలి నుంచి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న దీదీ అసెంబ్లీలో నేడు సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నామని, దీనికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆ రాష్ట్ర మంత్రి పి.చటర్జీ కోరారు. సీఏఏ చట్టానికి పార్లమెంటు ఆమోద ముద్రవేసినప్పటి నుంచి దాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తేలేదని మమత బెనర్జీ చెబుతున్నారు. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే దేశంలో నాలుగో రాష్ట్రం అవుతుంది. ఇప్పటికే కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానాలు ఆమోదించాయి.

Related posts