telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పబ్జీతో పాటు 118 యాప్ లపై కేంద్రం నిషేధం

game pubjii moboile

ఇటీవల చైనా యాప్ లను నిషేదించిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొంది. పబ్జీ గేమ్ తో పాటు 118 యాప్ లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మొబైల్ యాప్ లు దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు విఘాతం కలిగిస్తోందని కేంద్ర ఓ ప్రకటనలో పేర్కొంది. ఎంతోకాలంగా పబ్జీ గేమ్ ను నిషేధించాలని కోరుకుంటున్న వారి ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంది.

పబ్జీ, లివిక్, పబ్జీ మొబైల్ లైట్, వుయ్ చాట్ వర్క్, వుయ్ చాట్ రీడింగ్ వంటి పలు ఆప్ లు కేంద్రం విడుదల చేసి నిషిద్ధ యాప్ ల జాబితాలో ఉన్నాయి. కేంద్రం ఇంతకుముందే టిక్ టాక్, హలో వంటి యాప్ లను నిషేదించింది. తాజాగా అనేకమంది ప్రాణాలు పోవడానికి కారణమైన పబ్జీ పై కేంద్రం దృష్టి సారించింది.

Related posts