telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక సినిమా వార్తలు

సినీ షూటింగులకు కేంద్రం అనుమతి!

cinema shooting

కరోనా దెబ్బకు దేశంలోని ఎన్నో రంగాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం షూటింగులు ప్రారంభమైనా కరోనా కేసులు వస్తుండడంతో అవి నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో సినీ, టీవీ రంగాలకు ఊరటనిచ్చేలా కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది.

తాజాగా అన్ లాక్-3లో భాగంగా కేంద్రం సినీ, టీవీ షూటింగులకు అనుమతి ఇచ్చింది. అయితే, అనేక నిబంధనలను విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఓ ప్రకటన చేశారు. కెమెరా ముందు ఉండే నటీనటులు తప్ప మిగతా వాళ్లందరూ మాస్కులు వేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

షూటింగుల్లో యూనిట్ సభ్యులందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. లొకేషన్ లో తాత్కాలిక ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.సాధ్యమైనంత తక్కువ సిబ్బందితో షూటింగ్ జరుపుకోవాలి.షూటింగ్ స్పాట్ లో సిబ్బంది తప్పకుండా థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. నటీనటులతో సన్నిహితంగా ఉండాల్సిన మేకప్ సిబ్బంది తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాలని నిబంధనల్లో పేర్కొన్నారు.

Related posts