telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అశ్వథ్థామ‌” ట్విట్టర్ టాక్

Ashwatthama

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా, త‌న సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ లో ‘అశ్వథ్థామ‌’ అనే చిత్రంలో నటించారు. మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేశారు. నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 31న అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమ్మాయిల మీద జరుగుతున్న ఆరాచకా ఎదురొడ్డే కుర్రాడే కథే ‘అశ్వథ్థామ’. ఓ యూనిక్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి కథ అందించింది నాగశౌర్యనే కావడం విశేషం. టైటిల్, ఫస్ట్ లుక్, ట్రైలర్‌లతో ఈ సినిమా అంచనాలను పెంచేసిన ‘అశ్వథ్థామ’ మూవీ ఇప్పటికే యుఎస్‌లో ప్రీమియర్ షోలు పడటంతో ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు నెటిజన్లు. నాగశౌర్య ఫస్ట్ టైమ్ మాస్ లుక్‌లో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడని, ఆయన ఎంటైర్ కెరీర్ లో గత చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ చిత్రంలో మరో ఎత్తు అని, ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్‌తో సినిమా ప్రారంభం కావడం మరో థ్రిల్లింగ్ అని, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్, గిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్‌గా ఉన్నాయి అంటున్నారు నెటిజన్లు. ఫస్టాఫ్ మొత్తం సస్పెన్స్ రైడ్‌గా సాగిందని, హీరో సిస్టర్‌కి జరిగిన పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్‌తో ‘అశ్వథ్థామ’ ఎమోషనల్‌గా ఉందంటున్నారు. దర్శకుడు ఈ చిత్రంలో విలన్ క్యారక్టరైజేషన్‌గా బాగా ప్రజెంట్ చేశారని, పోస్ట్ ఇంట్రవల్‌లో విలన్ ఇంట్రో ఎపిసోడ్ థ్రిల్లింగ్ అనిపిస్తుందని, అయితే సాంగ్స్, క్లైమాక్స్ తేలిపోయాయని అంటున్నారు.

Related posts