మార్చినెలలో జరగనున్న ఏపీ ఎస్ఎస్ సి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును పొడగించారు. రెగ్యులర్, గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు, తత్కాల్ స్కీమ్ కింద రూ.వెయ్యి అపరాధ రుసుంతో పరీక్ష రుసుం సంబంధిత స్కూలు ప్రధానోపాధ్యాయులకు చెల్లించేందుకు గడువు తేదీని ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రుసుం చెల్లించి నమోదైన విద్యార్థులు మాత్రమే జూన్ నెలలో జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు కూడా అర్హులవుతారని వారు స్పష్టం చేశారు.
కొత్త రాజధానుల జపం చేయడం మంచిదికాదు: వీహెచ్