బెలూన్ రంగును బట్టి కాదు లోపలున్న గ్యాస్‌ను బట్టి ఎగురుతుంది అనే సిద్దాంతాన్ని కెమెరామెన్ రామతులసి బాగా వంటబట్టించుకున్నారు. వాడేది ఏ కెమెరా అయినా క్రియేటివిటీ వుంటే అద్భుతాలు స్రుష్టించచ్చు అని నిరూపించారు.
ఆయన సినిమాటోగ్రఫీ అందించిన రక్తం చిత్రానికి అంతర్జాతీయ అవార్డు లభించింది. ఒక తెలుగు సినిమా కు అంతర్జాతీయ సినిమాటోగ్రఫీ అవార్డు రావడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఆయన `మౌనమే ఇష్టం` అనే చిత్రానికి సినిమాటో గ్రఫీ అందించారు. సినిమా విడుదల సందర్భంగా పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ..
నేపథ్యం..
– నేను తెలుగువాడినే అయినా.. మా పూర్వీకులు తమిళనాడుకి వలస వెళ్లిపోవడంతో అక్కడే పుట్టి పెరిగాను. తమిళనాడు రాష్ట్రంలో రాజపాళెం అనే ఊర్లో పుట్టాను. ఎన్.కె.ఏకాంబరంగారి వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాను. అయితే షాజీ కైలాస్ నన్ను కెమెరామెన్‌గా పరిచయం చేశారు.
తెలుగుకే ఎక్కువ ప్రాధాన్యత….
– `మౌనమే ఇష్టం` ఈ నెల 15న విడుదల కానుంది. అలెక్సా కెమెరాను ఉపయోగించి దర్శకుడి అభిరుచికి అనుగుణంగా ప్రతి ప్రేమును పెయింటింగ్ లాగా తెరకెక్కించాం. అశోక్ కుమార్ కొరలత్ ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్…. ప్రతి ఫ్రేమూ తన ఆర్ట్ వర్క్ లాగే వుండాలనుకుంటారు. లైటింగ్ లాంటి విషయాల్లో నన్ను బాగా ఎంకరేజ్ చేసి సినిమా బాగా రావడానికి కృషి చేశారు. ఆయన పట్టుదల చూసేకొద్దీ మాలో ఉత్సాహం పెరిగేది. ఈ చిత్రం నా కెరీర్ లో ఒక మైలురాయిలా నిలుస్తుంది. నేను చెన్నైలో వున్నా తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాను.
ఆయనతో మంచి అనుబంధం…
– రాజేష్ టచ్ రివర్‌గారు మంచి టెక్నీషియన్. నా బంగారు తల్లి సమయంలో ఆయనతో ఏర్పడ్డ పరిచయం ఇంకా కొనసాగుతూనే ఉంది.
మరో అడుగు ముందుకు…
– సినిమాటోగ్రాఫర్‌గా నాకు `మౌనమే ఇష్టం ` 7వ సినిమా. `నా బంగారు తల్లి` చిత్రం ద్వారా నేను తెలుగు తెరకు పరిచయం అయ్యాను. రాజేష్ టచ్‌రివర్ రూపొందించిన ఆ చిత్రం ద్వారా నాకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే రక్తం చిత్రానికి సినిమాటో గ్రాఫర్ గా పనిచేశాను. `రక్తం` చిత్రానికి గానూ,Indie” Gathering Film Festival in Ohio.లో బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా అంతర్జాతీయ అవార్డు దక్కింది.
తదుపరి ప్రాజెక్ట్స్…
ప్రస్తుతం తెలుగు, ఒడియా భాషల్లో `పట్నఘడ్` అనే చిత్రం జరుగుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఆ చిత్రం కూడా వండర్ క్రియేట్ చేయబోతోంది. `పట్నఘడ్` చిత్రానికి కూడా రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వం వహించారు. ఇక మౌనమే ఇష్టం సినిమా విషయానికి వస్తే.. అశోక్ కుమార్ కొరలత్ ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్…. ప్రతి ఫ్రేమూ తన ఆర్ట్ వర్క్ లాగే వుండాలనుకుంటారు. లైటింగ్ లాంటి విషయాల్లో నన్ను బాగా ఎంకరేజ్ చేసి సినిమా బాగా రావడానికి కృషి చేశారు. ఆయన పట్టుదల చూసేకొద్దీ మాలో ఉత్సాహం పెరిగేది. ఈ చిత్రం నా కెరీర్ లో ఒక మైలురాయిలా నిలుస్తుంది. నేను చెన్నైలో వున్నా తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాను.