telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మధుర జ్ఞాపకం…

ఎంతని కప్పుకోను నీ తలపులను
నిద్దురేలేని కనుపాపలో నీ రుాపమై
పలకరిస్తుంటే
ఒంటరినే నీకై వేచే అభిసారికనే
పరిచాను నా మది
పాదరసంలా దొర్లిపోతుానీవు
ప్రేమ నిరీక్షణలో ఆవిరై పోతుా నేను
అందకారంలో కృంగిపోతుా
ముాతపడని కన్నుల్లొ
మౌనగీతాలే నీచెవిన చేరని స్వరమై
అన్ని అలజడులే ఆటుపోటులే
ఆగిపోదు ఎందుకో పిచ్చిగుండె
వీడిపోయిన బాటలో
తిరిగొస్తావని
మనసుకు కన్నులెట్టి చుాస్తుంది
నీ పాదం సోకిన తిరిగి బ్రతకాలని
కుారుకుపోయిన చింతనుండి
నవ్వుల వసంతం పుాయిస్తావని
చుాస్తున్నా తరగని ప్రేమతో
మచ్చలేని మమతతో
గాలిలో మధుర జ్ఞాపక ధుాపమే నేనై నీకై

Related posts