telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా”కు ఎన్నికోట్ల నష్టాలంటే ?

Syeraa

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి”. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. ఈ చిత్రం రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది . ఇప్పటికే 19 రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టినా.. అమ్మిన రేటు ప్రకారం చూస్తుంటే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కావడం కష్టంగానే మారింది. తెలుగు రాష్ట్రాల్లో 106 కోట్ల మార్క్ షేర్‌ను అందుకుంది సైరా నరసింహారెడ్డి. దసరా సెలవులు నైజాంలో ఈ సినిమాకు బాగానే ఉపయోగపడ్డాయి. సెలవుల తర్వాత వీక్ డేస్‌లో బాగా వీక్ అయిపోయింది సైరా. 19వ రోజు సెలవు కావడంతో 80 లక్షల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. మొత్తంగా 240 కోట్ల గ్రాస్, రూ. 141 కోట్లు షేర్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది సైరా. ఈ చిత్రాన్ని 180 కోట్లకు పైగానే అమ్మాడు నిర్మాత రామ్ చరణ్. తెలుగులో మాత్రమే సైరా హిట్ అయింది. అది కూడా కొన్నిచోట్ల ఇంకా సేఫ్ జోన్‌కు రాలేదు. నైజాం, ఉత్తరాంధ్ర లాంటి ఒకట్రెండు చోట్ల మాత్రమే సైరా బ్రేక్ ఈవెన్ అయి లాభాలు తీసుకొచ్చింది. మిగిలిన చోట్ల నష్టాలు తప్పలేదు. ఇక మిగిలిన భాషల్లో అయితే ‘సైరా నరసింహారెడ్డి’ దారుణంగా నిరాశ పరిచింది. హిందీలో అయితే కనీస స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది ఈ చిత్రం. ఫుల్ రన్ కలిపితే కనీసం 8 కోట్లు కూడా తీసుకురాలేదు. అక్కడ వార్ సినిమా సైరాపై దారుణంగా దెబ్బేసింది. తెలుగులో కొన్నిచోట్ల మాత్రమే సైరా విజయం అందుకునేలా కనిపిస్తుంది. మిగిలిన చోట్ల మాత్రం చిరంజీవికి కాలం కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు 141 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇంకా 40 కోట్లకు పైగా వెనకబడి ఉంది ఈ చిత్రం. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ కమర్షియల్‌గా చాలా దారుణంగా నిరాశ పరిచిందనే చెప్పాలి.

Related posts