telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“శ్యామ్ సింగరాయ్”లో 65 ఏళ్ళ వృద్ధుడిగా నాని ?

Nani

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్‌ జగదీష్‌’లో నటిస్తున్నారు. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నానితో జోడీ కడుతున్నారు. షైన్ స్క్రీన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘టక్ జగదీష్’తో పాటు రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో మరో చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘శ్యామ్ సింగరాయ్’ అనే టైటిల్‌ కూడా ప్రకటించారు. అయితే ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. కోల్‌కతా నేపథ్యంలో వాస్తవంగా జరిగిన సంఘటన ఆధారంగా ఈ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. ఇందులో సాయి పల్లవి, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్‌ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇందులో నాని త్రిపాత్రాభినయంలో నటించనున్నారని, అందులో ఒకటి 65 ఏళ్ల ముసలాడి పాత్ర అని సమాచారం. విలక్షణ పాత్రలు చేయడంలో ముందుండే నాని.. జెర్సీలో ఇప్పటికే ఓ బిడ్డ తండ్రిగా నటించారు. ఇక ఇప్పుడు ముసలివాడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Related posts