telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ద‌ర్బార్‌” విడుదల తేదీ ఖరారు

Darbar

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం “ద‌ర్బార్‌”. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ లైకాఈ సినిమా విడుద‌ల తేదిని ఖ‌రారు చేసింది. సంక్రాంతి సంద‌ర్భంగా సినిమాను జ‌న‌వ‌రి 9న విడుద‌ల చేయ‌నున్నారు. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల్లోనూ సినిమా ఏక‌కాలంలో విడుద‌ల కానుంది. ఆదిత్య అరుణాచ‌ల‌మ్ అనే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ర‌జినీకాంత్ ఈ సినిమాలో ఆక‌ట్టుకోనున్నారు. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ర‌జినీకాంత్ కుమార్తె పాత్ర‌లో నివేదా థామ‌స్ న‌టించింది. నిన్న ఈ చిత్రం నుంచి విడుదల చేసిన “డం డం” అనే వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Related posts