telugu navyamedia
సినిమా వార్తలు

“భార‌తీయుడు-2” నుంచి కాజల్ అవుట్ ?

kajal not in position to attend modi oath ceremony

త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ క‌ల‌యిక‌లో “భార‌తీయుడు-2” సినిమా స్టార్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్‌తో సినిమా… దీంతో కాజ‌ల్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఆమె ఆనందం ఎక్కువ రోజులు నిల‌వ‌లేదు. భారీ బ‌డ్జెట్ కార‌ణంగా “భార‌తీయుడు-2” ఆగింది. ఇప్పుడు చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని, అంతా సెట్ అయ్యింద‌ని, సినిమా జూన్‌లో మొద‌ల‌వుతుంద‌ని మ‌ళ్లీ వార్త‌లు వ‌స్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ.. వ‌చ్చిన చిక్క‌ల్లా జూన్ నెల‌లో కాజ‌ల్ త‌న డేట్స్‌ను ఇత‌ర ప్రాజెక్ట్స్‌కు కేటాయించేసిందట‌. ఇప్పుడు “భార‌తీయుడు-2” కోసం డేట్స్ కావాలంటే కాజ‌ల్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేద‌ట‌. దీంతో ఇప్పుడు కాజల్ ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకునే అవకాశం ఉందని, నయనతారను ఈ ప్రాజెక్టులోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నారనే వార్తలు కోలీవుడ్‌లో విన‌ప‌డుతున్నాయి.

Related posts