మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, పూజా హిగ్దే జంటగా నటించిన సినిమా అలా వైకుంఠపురములో. అయితే ఈ ఏడాది విడుదలయి భారీ విజయం సాధించిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. అంతేకాకుండా ఈ ఏడాది ఈ సినిమా రికార్డుల వర్షం కురిపించింది. వసూళ్లలో రికార్డు, టీఆర్పీలో రాకార్డు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ ఏడాది వరుసగా ఈ సినిమా రికార్డులు చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ ఏడాది ఎక్కవగా వీక్షించబడిన దక్షిణ భారత సినిమాలలో ఈ సినిమా ప్రథమ స్థానంలో నిలుచుంది. ఈ విషయాన్ని స్వయంగా నెట్‌ఫ్లిక్సే ప్రకటించింది. దీంతో అల్లు అర్జున్ అభిమానుల ఆనండానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ సినిమా మొదట థియేటర్లలో విడుదలైంది. తరువాత ఓటీటీలో కూడా విడులైంది. అయినప్పటికీ ఇన్ని రికార్డులు సాధించడం ఘనతనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సినిమాతోనే పూజా హిగ్దేకు బుట్టబొమ్మ అనే పేరు కూడా వచ్చింది. నెట్‌ఫ్లక్స్ వదిలిన జాబితాలో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా కనులు కనులను దోచాయంటే రెండవ స్థానంలో నిలిచింది.
previous post
next post
జగన్ నిర్ణయంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి: కేశినేని నాని