telugu navyamedia
సినిమా వార్తలు

“మజిలీ” దర్శకుడి జీవితంలో “బుజ్జి” మలుపు

Shiva-Nirvana

శివ నిర్వాణ డైరక్షన్ లో అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా, షైన్ స్క్రీన్ బ్యానర్ లో వచ్చిన సినిమా మజిలీ. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 5న శుక్రవారం రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడికి మంచి క్రేజ్ వచ్చింది. ఎమోషనల్ కథలను ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా తెరకెక్కించగల దర్శకుడిగా శివ నిర్వాణకి మంచి గుర్తింపు లభించింది. ఒకవైపు మజిలీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న శివ నిర్వాణకి ఇటు నిజ జీవితంలో కూడా మరో సంతోషం దక్కింది. ఆయన పండంటి మగబిడ్డకి తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని శివ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్ట్ చూసిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో శివకు అభినందనలు తెలుపుతున్నారు.

Related posts