telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామానాయుడు స్టూడియోను అమ్మేస్తున్నారా… అసలు విషయం ఇదీ…!

Suresh

ఇండస్ట్రీలో 35 ఏళ్ల చరిత్ర ఉన్న డా. రామానాయుడు స్టుడియో మూతబడుతుందనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత, రామానాయుడు వారసుడు సురేష్ బాబు. రామానాయుడు స్టుడియో అంటే ఒక బ్రాండ్ అని అది ఎప్పటికీ అలాగే ఉంటుందన్నారు సురేష్ బాబు. ఈ స్టుడియోను 7 స్టార్ హోటల్‌గా మార్చబోతున్నారనే వార్తలపై స్పందిస్తూ.. ‘మాకు మంచి అవకాశం వచ్చింది.. రామానాయుడు స్టుడియోను 7 స్టార్ హోటల్‌గా కాదు.. కమర్షియల్ కాంప్లెక్స్‌, హౌసింగ్ ఫ్లాట్స్‌గా బిల్డ్ చేస్తున్నారు. కాని ఒక్క విషయం నేను ఖచ్చితంగా చెప్తున్నా.. నా ఫ్యామిలీ, నేను, నా కొడుకులు కంటిన్యూగా స్టుడియోలను నిర్మిస్తూనే ఉంటాము. ఇప్పుడు నేను నానక్‌రామ్ గూడలో ఉన్న స్టుడియో తీసేది.. దానికంటే పెద్ద స్టుడియో కట్టడానికి. ప్రస్తుతం ఉన్న స్టుడియో కంటే పెద్ద స్టుడియో కట్టిన తరువాతే నానక్‌రామ్ స్టుడియోని కన్వర్ట్ చేస్తా. ప్రస్తుతం ఉన్న ప్లేస్ చాలడం లేదు. అందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో పెద్ద స్టుడియో నిర్మించబోతున్నా. అది విశాఖపట్నంలో కావచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా కావచ్చు. ఇది తీసేస్తున్నా అంటే పెద్ద రామానాయుడు స్టుడియో కట్టేందుకు మాత్రమే. హైదరాబాద్‌లో కూడా పెద్ద రామానాయుడు స్టుడియో రాబోతుంది. ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలని అనుకున్నది నా వ్యక్తిగతం. నాకు జీవితం అంటే ఏంటో తెలుసు.. దాన్ని ఎలా ఆస్వాదించాలో కూడా ప్లానింగ్ ఉంది. ప్రకృతిని ఆస్వాదించడం, ఫారెస్ట్‌కి వెళ్లడం లాంటివి నా పర్సనల్. నా దృష్టిలో పేరు అనేది పెద్ద వాల్యూ ఉండదు. ఉంటే ఉంటుంది పోతే పోతుందని అని నమ్ముతా. నా కంటే ఎక్కువగా రానాకి సినిమాపై ఎక్కువ పాషన్ ఉంది. నా తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో రానా చాలా ధీమాగా ఉన్నాడు.. ఏది ఏమైనా రామానాయుడు స్టుడియో అంతర్జాతీయ ప్రమాణాలతో పెద్దగా నిర్మిస్తాం’ అని తెలియజేశారు సురేష్ బాబు.

Related posts