telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొత్త దర్శకుడికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ?

RC

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చరణ్ ఓ నూతన డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వబోతున్నాడనే వార్త వైరల్ గా మారింది. లాక్ డౌన్ లో చరణ్ చాలా కథలను విన్నాడట వాటిలో ఓ కథకు ఆయన ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది. రీసెంట్ గా సతీష్ అనే కొత్త దర్శకుడు.. చరణ్ కు ఓ స్టోరీ వినిపించగా… ఆ స్టోరీ బాగా నచ్చడం తో వెంటనే చరణ్ ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ కథ చాలా ఇన్నోవెటివ్ కాన్సెప్ట్ అని సమాచారం .రామ్ చరణ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు డెబ్యూ డైరెక్టర్ తో వర్క్ చేయలేదు. ఇప్పుడు ఇదే కనుక నిజమై ఈ ప్రాజెక్ట్ లైన్లోకి వస్తే మాత్రం చరణ్ కొత్త దర్శకుడితో వర్క్ చేయబోయే ఫస్ట్ సినిమా అవుతుంది. ఇక ఈ ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి కాగానే చరణ్ ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో సినిమా చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తఫై ఇంకా అధికారిక ప్రకటన రాకముందే మరో వార్త వైరల్ గా మారింది.

Related posts