టీవీ నటి తృప్తి శంఖధార్ (19) తన తల్లి, సోదరుడితో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బరేలీకి చెందిన తృప్తి తనను రక్షించాలంటూ వీడియో షేర్ చేసింది. “నా ఇష్టానికి వ్యతిరేకంగా వేరే వ్యక్తితో నా వివాహం జరిపించాలని నా తండ్రి ప్రయత్నించారు. ఆ వివాహానికి నేను నిరాకరించాను. దాంతో ఆయన నాపై హత్యాయత్నం చేశారు. నా జుట్టు పట్టుకుని లాగుతూ దారుణంగా కొట్టారు. పోలీసులు నా ఫిర్యాదును స్వీకరించడం లేదు. దయచేసి నాకు రక్షణ కల్పించండి” అని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. అయితే ఈ ఘటనలో తమకు ఎటువంటి లిఖితపూర్వక ఫిర్యాదు రాలేదని, సోషల్ మీడియాలో నటి పోస్ట్ గురించి తెలుసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని బరేలీ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు తృప్తి తండ్రి, రియల్ ఎస్టేట్ వ్యాపారి రామ్ రతన్ ఈ ఆరోపణలను ఖండించారు. కాగా టిక్ టాక్ స్టార్ కిరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘‘ఓయ్ ఇడియట్’’ సినిమాలో తృప్తి హీరోయిన్‌గా నటిస్తోంది.
previous post
next post
మొటిమలు, స్కిన్ సమస్యలు అందరికీ వస్తాయి… : రితికా సింగ్