telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ సేతుపతి ‘లాభం’ ఫస్ట్ లుక్..

విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన సినిమా ‘లాభం’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదల చేశారు. ఆయనతో పాటు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రవి వై, నవీన్ ఎర్నేని ఈ ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాబీ విడుదల చేసిన విజయ్ సేతుపతి 'లాభం' ఫస్ట్ లుక్

ఈ చిత్రం సెప్టెంబరు 9న వినాయక చవితి సందర్భంగా తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో లాభం ఫస్ట్‌లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తుండగా, సాయి ధన్సిక ఓ కీలకపాత్ర పోషిస్తోంది. అలాగే విజయ్ సేతుపతి రైతు సమస్యలపై పోరాడే యువకునిగా కనిపించనున్నాడు.

ఎస్.పి. జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ చిత్రానికి లాయర్ శ్రీరామ్ సమర్పణ. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Vijay Sethupathi and Shruti Haasan starrer 'Laabam' to release on September  9 | Telugu Movie News - Times of India

విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన నటించిన చిత్రాలు ఇప్పుడు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాధించుకుంటున్నాయి. ఇటీవల తెలుగులో నేరుగా నటించిన సైరా, ఉప్పెన చిత్రాలలో ఆయన పాత్రలకు మంచి అప్లాజ్ వచ్చింది. ‘లాభం’ చిత్రంతోనూ ఆయన తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తారనే నమ్మకం వుంది. ఇందులో అతని పాత్ర తన గత చిత్రాల్లానే చాలా వైవిధ్యంగా ఉంటుందని అనుకుంటున్నా. ఫస్ట్ లుక్ చూస్తుంటే… విజయ్ సేతుపతి లుక్ చాలా యూనిక్‌గా కనిపిస్తోంది. ఇందులో రైతుల సమస్యలపై పోరాడే యువకుని పాత్రలో విజయ్ సేతుపతి ప్రేక్షకుల్ని అలరిస్తారని నమ్మకం ఉంద‌ని దర్శకుడు బాబీ అన్నారు.

అలాగే ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా విడుదలవుతోంది కాబట్టి దేవుడి ఆశీస్సులు కూడా ఈ చిత్రానికి, నిర్మాతలకు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

Vijay Sethupathi: 'Laabam' will have a big theatrical release | Tamil Movie  News - Times of India

Related posts