telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రధాని తీసుకువచ్చిన.. ఆయుష్మాన్ భారత్ ఒక గొప్ప పథకం

kishanreddy on ap capital

కోవిడ్ సంక్షోభ సమయంలో ఈ.ఎస్.ఐ.సి. హైదరాబాద్ అందించిన సేవలు ప్రశంసనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఈ.ఎస్.ఐ.సి హైదరాబాద్ లో నాలుగు సరికొత్త వైద్య సేవలు, సదుపాయాలను ప్రారంభించారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవ భారత నిర్మాణంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అనేక ఆరోగ్య సంరక్షణ పథకాలకు రూపకల్పన చేసి, సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఐదు లక్షల ఆరోగ్య భీమా సదుపాయం గల ఆయుష్మాన్ భారత్ ఒక గొప్ప పథకం అని, దీని ద్వారా దేశంలో ఎక్కడయినా కార్పోరేట్ వైద్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. మార్కెట్ ధర కంటే.. 50% నుండి 90% తక్కువ ఖర్చుతో ఔషధాలను అందించే జన ఔషధీ కేంద్రాల వ్యవస్థ, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, మిషన్ ఇంధ్ర దనుష్ మొదలైన పథకాలు ప్రజలకు గొప్ప వరమని మంత్రి తెలిపారు. కోవిడ్ సంక్షోభ సమయంలో ఈ.ఎస్.ఐ హైదరాబాద్ సేవలు చాలా ప్రశంసనీయమని, డీన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం అహర్నిశలు కృషి చేసి సరికొత్త ఆవిష్కరణలతో సరైన సమయంలో రోగులకు వైద్య సేవలను అందించారన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తరువాత అనేక సార్లు ఈ.ఎస్. ఐ ఆసుపత్రి ని సందర్శించానని, కోవిడ్ మహమ్మారి వ్యాపించిన పరిస్థితుల్లో కూడా ఈ కళాశాలలో ప్రత్యేక వార్డులను ప్రారంభించానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

Related posts