telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ఫస్ట్ లుక్

Ramu

బొమ్మాకు క్రియేషన్స్ సంస్థ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిజ జీవితాన్ని 3 భాగాలుగా నిర్మించబోతోంది. 3 చిత్రాల్లో ఒక్కొక్క చిత్రం నిడివి సుమారు 2 గంటలుంటుంది. మొత్తం 3 చిత్రాలు కలిపి 6 గంటలు. బొమ్మాకు మురళి నిర్మాణంలో రామ్ గోపాల్ వర్మ ఆధ్వర్యంలో దొరసాయి తేజ ఈ చిత్రానికి దర్శకత్వం చేయబోతున్నాడు. ఈ బయోపిక్ ‘రాము’, ‘రామ్ గోపాల్ వర్మ’, ‘ఆర్జీవీ-ది ఇంటెలిజెంట్ ఇడియట్’ అనే పేర్లతో మూడు భాగాలుగా తెరకెక్కనుంది. తొలి భాగానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిన్న విడుదల చేశారు. కాసేపటి క్రితం ఫస్ట్ లుక్ మోషన్ పిక్చర్ ను వర్మ విడుదల చేశారు.

సెప్టెంబర్ లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. పార్ట్ 1 లో 20 ఏళ్ళ ఆర్జీవీ లాగా ఒక కొత్త యువ నటుడు నటించబోతున్నాడు. పార్ట్ 2 సినిమాలో లో వేరే నటుడు నటించబోతున్నాడు. పార్ట్ 3 లో ఆర్జీవీయే స్వయంగా ఆర్జీవీగా నటించబోతున్నారు. 3 పార్టుల్లో, ఒక్కొక్క పార్టు ఆర్జీవీ జీవితంలోని ఆయన వేరు వేరు వయసుల్లో జరిగిన వేరు వేరు అంశాలను చూపెట్టబోతోంది. మొదటి భాగం సినిమా పేరు “రాము” రామ్ గోపాల్ వర్మ ఆరంభం. దీంట్లో ఆయన విజయవాడ కాలేజ్ రోజులు, ఆయన తొలి ప్రేమలు, అప్పట్లో ఆయన పాల్గొన్న గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి , ఆయన శివ సినిమా చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడు, రిలేన్ షిప్స్ ను ఎలా మాయ చేసి వాడుకున్నాడు అన్నది ప్రధాన కథాంశం గా చూపెట్టబోతోంది. పార్ట్ 2 “రామ్ గోపాల్ వర్మ” అండర్ వరల్డ్ తో ప్రేమాయణం. ఇది తన ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ మరియు అమితాబ్ బచ్చన్ లతో ఆయనకున్న అనుబంధాల గురించి చూపెట్టబోతోంది. పార్ట్ 3 “RGV” ది ఇంటెలిజెంట్ ఇడియట్. ఇది ఆయన ఫెయిల్యూర్లు, వివాదాలు, ఆయనకున్న దేవుళ్ళ పట్ల, సెక్స్ పట్ల , సమాజం పట్ల ఉన్న విపరీత వైఖరులతో పాటు చాలా మంది మీద ఆర్జీవీ ప్రభావం గురించి చూపెట్టబోతోంది.

Related posts