telugu navyamedia
సినిమా వార్తలు

“కూలీ నెం.1″కు ప్రధాని ప్రశంసలు

Modi

కాన్ఫ‌రెన్స్ ఆఫ్ పార్టీస్ 14వ (సీఓపీ14) స‌ద‌స్సులో ప్ర‌ధాని మోదీ ప్లాస్టిక్ వ‌ల‌న ప‌ర్యావ‌ర‌ణంకి హాని జ‌రుగుతుంద‌ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాల‌ని త‌మ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు మోదీ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ‌దేశాలు కూడా సింగిల్ యూజ్ (వాడి ప‌డేసే) ప్లాస్టిక్‌కు గుడ్‌బై చెప్సాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంద‌న్నారు. మోదీ పిలుపుకి కూలీ నెం.1 చిత్ర టీం స్పందించింది. చిత్ర షూటింగ్ ప్లాస్టిక్ వాట‌ర్ బాటిల్స్ బ‌దులు స్టీల్ బాటిల్స్ వాడారు. ఈ విష‌యాన్ని చిత్ర హీరో వరుణ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ .. న‌రేంద్ర మోదీ పిలుపుని స్పూర్తిగా తీసుకొని ప్లాస్టిక్ ర‌హిత దేశంగా మార్చే ప్ర‌క్రియ‌లో మేం కూడా భాగం కావాల‌ని అనుకున్నాం. అందుకోసం ఇప్ప‌టి నుండి స్టీల్ వాట‌ర్ బాటిల్స్ వాడాల‌ని నిర్ణ‌యించుకున్నాం. చిన్న మార్పుల ద్వారా మ‌నం అనుకున్న‌ది సాధించ‌వ‌చ్చు అని వ‌రుణ్ స్ప‌ష్టం చేశారు. వ‌రుణ్ ట్వీట్‌కి స్పందించిన మోదీ కూలీ నెం.1 టీం తీసుకున్న నిర్ణ‌యం అద్భుత‌మైనది. ప్లాస్టిక్ ర‌హిత దేశంగా మార్చేందుకు సినీ పరిశ్ర‌మ నుండి ల‌భిస్తున్న మ‌ద్ద‌తు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంద‌ని చిత్ర బృందంపై ప్ర‌శంస‌లు కురిపించారు.

Related posts