telugu navyamedia
సినిమా వార్తలు

తిరుప‌తి కోర్టుకు హాజ‌రైన‌ క‌లెక్ష‌న్ కింగ్ మెహ‌న్‌బాబు

తిరుప‌తి కోర్టుకు హాజ‌రైన‌ క‌లెక్ష‌న్ కింగ్ మెహ‌న్‌బాబు
మెహ‌న్‌బాబుతో కోర్టుకు హాజ‌రైన విష్ణు, మ‌నోజ్‌
2019లో ఎన్నిక‌లు కోడ్ ఉల్లంఘించార‌ని కేసు న‌మోదు
విద్యార్ధుల‌పై పోరాడితే నా మీద కేసు పెట్టారు.

సినీ నటుడు మెహ‌న్‌బాబు ఇవాళ‌ తిరుప‌తి కోర్టుకు హాజ‌రైయ్యారు. తిరుపతిలోని ఎన్టీఆర్ సర్కిల్ నుండి మోహన్ బాబు, ఆయన ఇద్దరు కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ పాదయాత్రగా కోర్టుకు హాజ‌రుకావ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

2019 మార్చి 22న తన కాలేజీలో చదువుకునే విద్యార్ధులకు ఫీజ్ రీయింబ‌ర్స్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ తో మోహన్ బాబు తిరుపతి మదనపల్లెలో జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఆ స‌మ‌యంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉంది .

మోడ‌ల్ కోడ్ ఆఫ్ కాండ‌క్ట్‌ను ఉల్లంఘిస్తూ ధ‌ర్నా చేసినందుకు మోహ‌న్‌బాబుతో పాటు ఆయ‌న కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ పై చంద్ర‌గిరి పోలీసులు కేసు రిజిస్ట‌ర్ చేశారు.

ఈ వ్యవహారంపై విచారణ జరిగింది. పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఏ1 నుంచి ఏ5 వరకు నేరానికి పాల్పడ్డారంటూ చార్జిషీటులో పేర్కొన్నారు.

ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా మంగళవారం తిరుపతిలోని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందుకు మంచు మోహన్ బాబు, ఆయన కుమారులు  హాజ‌రైయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీ మనిషినని , కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకొనే వ్యక్తుల్లో తాను ఒకడినని ఆయన చెప్పారు. తాను రియ‌ల్ హీరోరు అని ,విద్యార్ధులు కోసం పోరాడితే అక్ర‌మంగా కేసులు పెట్టార‌ని ఆరోపించారు.

2014 నుండి 2019 వరకు మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల్లో చదివే విద్యార్ధులకు రూ. 30 కోట్లు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కింద రావాల్సి ఉందని తెలిపారు.

Related posts