telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భార‌త్‌ ను హెచ్చరించిన అమెరికా…

india usa flag

భార‌త్‌లో క‌రోనా సంక్షోభం చాలా తీవ్రంగా ఉండ‌బోతోంద‌ని.. పాజిటివ్ కేసులు ఇంకా పీక్ స్టేజ్‌కు వెళ్ల‌లేద‌ని.. భ‌విష్య‌త్‌లో మ‌రింత పీక్‌కు వెళ్తాయ‌ని అంచ‌నా వేస్తోంది అమెరికా ప్ర‌భుత్వం.. భార‌త్‌లో రోజూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది… కానీ, ఇది ఇంకా పీక్ స్టేజ్‌కు వెళ్లలేద‌న్న అమెరికా విదేశాంగ శాఖకు చెందిన అంత‌ర్జాతీయ కోవిడ్ రెస్పాన్స్‌, హెల్త్‌సెక్యూరిటీ కోఆర్డినేట‌ర్ గేల్ స్మిత్.. అత్య‌వ‌సరంగా దృష్టి సారించాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌న్నారు.. అందుకే, మేం వెంట‌నే అత్య‌వ‌స‌ర స‌ర‌ఫ‌రాలైన ఆక్సిజ‌న్‌, వైద్య ర‌క్ష‌ణ సామాగ్రి, వ్యాక్సిన్ తయారీ ముడి ప‌దార్థాలు వంటివి పంపిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.. భార‌త్ నుంచి కావాల్సిన వ‌స్తువ‌ల జాబితా అంద‌గానే ఇంట‌ర్ ఏజెన్సీ చాలా వేగంగా వాటికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాయ‌ని.. ఇప్ప‌టికే భార‌త్‌లో త‌మ విమానాలు ల్యాండ్ అయిన‌ట్టు వెల్ల‌డించారు  గేల్ స్మిత్. అయితే ఈరోజు భారత్ లో నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Related posts