సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట. జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ‘కళావతి’ సాంగ్ యుట్యూబ్లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. చాలామంది సినిమా తారలు అలాగే ఇతరులు… సూపర్ స్టార్ మహేష్ బాబు తరహాలో స్టెప్పులేస్తూ వీడియోలు చేస్తున్నారు.
సంగీత దర్శకుడు తమన్ కంపోజ్ చేసిన ఈ పాట ప్రస్తుతం 50 మిలియన్స వ్యూస్‌ను అందుకుని రికార్డు సృష్టించింది. కేవలం 13 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ ను రాబట్టడం గమనార్హం. ఈ సినిమా మే 12వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
సుశాంత్ సోదరిపై రియా చక్రవర్తి సంచలన ఆరోపణలు