ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వేడేక్కుతున్నాయి. ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ పార్టీ అయితే.. ఏకంగా కేంద్రమంత్రులనే రంగంలోకి దించుతోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన మరుక్షణం రాష్ట్ర ప్రభుత్వం కూల బోతోందని… ఆ విషయం తెలిసి కేసీఆర్ వణికి పోతున్నాడని తెలిపారు. అందుకే ఉద్యోగ సంఘాలను పిలిచి పీఆర్సీ ఇస్తా అని చెప్పి ఉంటాడని.. పీఆర్ సి ఇస్తా అనడం అది పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వం దగ్గర పైసలే లేవు అందుకే 7.5% కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వలేమని బిస్వాల్ కమిటీ చెప్పిందని పేర్కొన్నారు. ఉద్యోగులకు 1 తేదీన జీతాలే ఇవ్వలేని ఈ సర్కార్ పీఆర్సీ ఇస్తుందంటే నమ్ముతామా… గవర్నమెంట్ కూలిపోకుండా భయపడి చెబుతున్నాడని మండిపడ్డారు.
previous post
next post
సునీత ఆరోపణలపై స్పందించిన బన్నీ వాసు