నెల్లూరు రూరల్ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరును టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం టీడీపీ అభ్యర్థిగా ఆదాల ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. శనివారం హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆదాల పార్టీ కండువా కప్పుకున్నారు.
వర్గపోరుతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ గడ్డు పరిస్థితిలో ఉందని భావించి ఆయన పోటీపై పునరాలోచనలో పడ్డారు. టీడీపీలో టికెట్ కన్ఫామ్ అయినప్పటికీ.. వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా లేదా కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ వేత్త మాజీ రాజ్యసభ సభ్యురాలు వంగా గీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు చేపట్టిన ఆమె 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి పిఠాపురం టికెట్ ఆశించి భంగపడ్డారు.
ఏ ఆస్పత్రిలో చూసినా మందుల కొరత: ఉత్తమ్