చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలోని కేబీఆర్‌పురంలోకి రోజాను రానివ్వకుండా నిన్న సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సొంతపార్టీ కార్యకర్తలపైనే రోజా కేసు నమోదు చేయించారు. పుత్తూరులోని పోలీస్ స్టేషన్‌లో తన అనుచరులతో రోజా కేసు నమోదు చేయించారు.
వైసీపీ నాయకులను పట్టించుకోకుండా టీడీపీ నుంచి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రోజా ప్రాధాన్యం ఇస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 30 మంది కేబీఆర్‌పురం వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు ఇప్పటివరకు స్పందించలేదు.